Tuesday, 3 November 2026

మండల కేంద్రంలో మైనార్టీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలో గందరగోళంమండల కేంద్రంలో మైనార్టీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలో గందరగోళం

-మండల మైనారిటీ నాయకుడుషేక్ హుస్సేన్..
– కేవలం ఒక్క యూనిట్ మాత్రమే నా..
– మైనారిటీ బాధలు పాటించుకొని ప్రభుత్వం.. అధికారులు
ఎల్కతుర్తి ఫిబ్రవరి 2 ( జనం సాక్షి న్యూస్)

మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 2022- 23 సంవత్సరానికి బ్యాంక్ లిక్విడ్ సబ్సిడీ లోన్స్ మంజూరు కొరకు మండల కేంద్రంలో ని ఎంపీడీవో ఆఫీసులో ఎంపీఓ ఆధ్వర్యంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ మండలానికి ఒక యూనిట్ మాత్రమే కేటాయించారు. ఈ యూనిట్ కాస్ట్ లక్ష రూపాయలు సబ్సిడీ 80% 20 శాతం మాత్రం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. కావున ఆశతో ఎంతోమంది మైనార్టీ విద్యార్థులు వ్యాపారస్తులు మండలంలో దాదాపు 85 మందికి పైగా అప్లై చేశారు. మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఒక యూనిట్ అని చెప్తే ఇంతమంది అప్లై చేసేవారు కాదని దాదాపు 1000 నుండి 1500 రూపాయలు ఖర్చయిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై  “జనం సాక్షి” ఎంపీఓను వివరణ అడగా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు లోన్స్ కు సంబంధించి పూర్తిగా సమాచారం తెలియజేయాలని అప్లై చేసుకున్న మైనార్టీ అభ్యర్థులు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల నాయకులు రహీం, భాష, బాబు, నజీర్  అంకుష్, పకీర్ తదితరులు పాల్గొన్నారు.