మంత్రిని సన్మానించి బార్ సభ్యులు
చిత్తూరు,మే4(జనం సాక్షి ): పలమనేరు బార్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం మంత్రి అమరనాథ రెడ్డి ని స్థానిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కోర్టు భవన ఏర్పాటును త్వరిత గతిన నిర్మింపజేసేందుకు చొరవ చూపాలని, అదే విధంగా పలమనేరులో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన మంత్రి భవన నిర్మాణ ఏర్పాటును త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఎటువంటి అపోహలు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీపతి జనరల్ సెక్రెటరీ బర్కత్, సీనియర్ న్యాయవాదులు పరమ శివప్ప, కుప్ప రాజు, ఇస్మాయిల్, మోహన్ రామిరెడ్డి, మరియు న్యాయవాదులు రెడ్డెప్ప శెట్టి, గుణశేఖర్,రవి,లోకేష్, కృష్ణమూర్తి తదితరులున్నారు.