మంత్రి కేటీఆర్ ని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన :చంపాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రీజిస్ట్రేషన్ మరియు యు.ఎల్.సీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కరం చూపింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర పురపాలక,
ఐటి,పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు జి ఓ.118 ను విడుదల చేశారు. ఈ సందర్బంగా చంపాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి ,మంత్రి కేటీఆర్ ని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మంత్రులు, మహమూద్ అలీ గారు, సబితా ఇంద్రారెడ్డి , మల్లా రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ,ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం , బుగ్గారపు దయానంద్ ,మేయర్ విజయ లక్ష్మి గారు,కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్ గుప్తా , సతీష్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు,ఎల్.బి.నగర్ తెరాస పార్టీ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , పలు విభాగాల కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పలు విభాగాల కమిటీ సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.