Thursday, 5 November 2026

మంత్రి కేటీర్ తో మహేష్ బిగాల భేటీ.

ఈరోజు ప్రగతి భవన్ లో తెరాస గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కేటీర్ గారితో సమావేశమయ్యారు , మహేష్ బిగాల కేటీర్ గారితో వివిధ విషయాలపై చర్చ జరిగింది. 22 అక్టోబర్ న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఆవిష్కరణ గురించి అలాగే కెసిఆర్ గారి జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాయాలను వారి సూచనలను కేటీర్ గారికి వివరించారు. తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేదర్‌ పేరు పెట్టాలనే నిర్ణయం పై ఎన్నారైలు సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి వివరించారు.కెసిఆర్ గారు జాతీయ రాజకీయ రంగ ప్రవేశం పై వివిధ దేశాలలో వున్నా అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విదంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడబెడుతామని మహేష్ బిగాల అన్నారు. మహేష్ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి కేటీర్ గారు అభినందించారు .