మంత్రి దయాకర్ రావు జన్మదిన వేడుకలు
వరంగల్ మహా నగరంలోని హంటర్ రోడ్ లో సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను జిల్లా కుమ్మర సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి పంచారు మంత్రి దయాకర్ రావు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ మరెన్నో పదవులు అనుభవిస్తూ ప్రజాసేవలో నిరంతరం తరలించాలని సముద్రాల స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ దాడి రాజు ,అశోక్ ,హేమ ,కేదారి, రాజు, పద్మ, శకుంతల, కమలమ్మ, ఎర్రం శెట్టి సంధ్య, తదితరులు పాల్గొన్నారు