మంత్రి దేవినేని హూందాతనాన్ని మరిచి మాట్లాడుతున్నాడు

– చంద్రబాబు దొంగల పార్టీని నడుపుతున్నాడు
– పట్టిసీమలో దోపిడీపై నివేదిక ఇచ్చింది కాగ్‌
– తెదేపా మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత సుధాకర్‌బాబు
విజయవాడ, మే2( జ‌నం సాక్షి) : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన హూందాతనాన్ని మరిచి జగన్‌పై వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..’చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయని అన్నారు. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్‌… వైఎస్సార్‌ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. విూ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం విూ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి.  రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే. కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు విూరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు
పెట్టిన దద్దమ్మలు విూరు. మా నాయకుడు… విూ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’  అంటూ సవాల్‌ విసిరారు.
——————————————

తాజావార్తలు