ఇంఫాల్: మణిపూర్‌లో ఇవాళ మొట్టమొదటి స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇంఫాల్‌లో 35 ఏళ్ల మహిళ హెచ్1ఎన్1 లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారి వెల్లడించారు. మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ముంబయికి పంపినట్టు తెలిపారు.





