Thursday, 5 November 2026

మద్యానికి బానిసై కుమారుడి గొంతు కోశాడు.ఓ తండ్రి

81d9lxawఅనంతపురం : కన్నతల్లిదండ్రులు కసాయిలుగా మారుతున్నారు. కొందరు వాతలు పెడుతూ..మరికొందరు చిత్ర హింసలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ తండ్రి ఏకంగా నాలుగేళ్ల కుమారుడి గొంతు కోశాడు. ఈ ఘటన జిల్లాలోని తాడిపత్రిలో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శశాంక్ అనే నాలుగేళ్ల బాలుడున్నాడు. మద్యానికి బానిసైన అతడు భార్యపైనే ఆధారపడే వాడని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇంట్లో ఏవో గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి చాలా సేపు ఏడ్చిన శశాంక్ పై తెల్లవారుజామున తన భర్త కత్తితో గొంతు కోశాడని సరస్వతి పేర్కొంది. వెంటనే అరుపులు..కేకలు వేయడం జరిగిందన్నారు. వెంటనే స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న తండ్రిని మధ్యాహ్నాం కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *