రోమ్: మధ్యదరా సముద్రంలో పడవలు మునిగి 200 మందికి పైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ అంచనా వేస్తోంది. శవవారం సుమారు 300 మంది తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కిక్కిరిసిన మూడు రబ్బరు పడవలలో లిబియా నుంచి ఇటలీకి బయలుదేరారు. వీటిలో రెండు పడవలు కనిపింకుండా పోయాయి. నాలుగు రోజుల అన్వేషణ అనంతరం ఈ రెండు పడవల్లోని 9 మందిని ఇటలీ దళాలు రక్షించాయి. మిగతా 203 మందిని సముద్ర కెరటాలు మింగివేశాయని ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ అధికార ప్రతినిధి కార్లోట్టా సామీ పేర్కొన్నారు. మూడో పడవలోని 100 మందిని సోమవారం ఉదయం ఇటలీ తీర గస్తీ దళాలు ట్రిపోలి సమీపంలో సురక్షితంగా కాపాడాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పడవలోని 29 మంది అప్పటికే ప్రాణాలు వదిలారు.





