Saturday, 7 November 2026

మనలను ఆశీర్వదించడానికే సోనియా రాక

మేడ్చెల్‌ సభలో రేవంత్‌ ప్రసంగం
మేడ్చల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):  పేదలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పడానికే సోనియా వచ్చారని  కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాన ఇచ్చిన తల్లిగా ఆమె మనలను ఆశీర్వదించడానికి వస్తున్నారని అన్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ సభకు భారీగా జనం తరలి వచ్చారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ప్రసంగానికి ముందే చప్పట్లతో సభాప్రాంగణం ¬రెత్తింది.2004లో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. ఇదే సభలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్‌ ఎన్నో పురిటినొప్పులు పడిందన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి సోనియా తెలంగాణ రాష్టాన్ని ఇచ్చిందని చెప్పారు. సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ రావాలన్నారు.  కూటమి శక్తిని చూసి కేసీఆర్‌ ఓటమిని ఒప్పుకున్నారని కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌బాబు అన్నారు. కేసీఆర్‌ మళ్లీ తిరిగిరాకుండా ఫాంహౌస్‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఇస్తామన్న పెన్షన్లకు రూ.16 కలిపి కేసీఆర్‌ ప్రకటించారని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, నాలుగున్నరేళ్లు అప్రజాస్వామిక, అసమర్ధ, కుటుంబ పాలన సాగిందని కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ ఆరోపించారు. తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సంపత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.