Wednesday, 4 November 2026

మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

టిఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు
ఎం ఏ నయీమ్ అప్పు.
తాండూరు జూన్18(జనంసాక్షి)మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.టిఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ఎం. ఏ నయీమ్ అప్పు పేర్కొన్నారు. శుక్రవారంతాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న మరియు ఇన్చార్జి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 27 వ తేదీ న బిజెపి జాతీయ స్పోక్ పర్సన్ నుపూల్ శర్మ మరియు జాతీయ టీవీ యాంకర్ నవీన్ జిందాల్ ఒక డెబిట్ లో మహమ్మద్ ప్రవక్త గురించి  తప్పుగా మాట్లాడడం జరిగిందని , అందుకు యావత్ ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన వారయ్యారు. అందుకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు జాతీయ పార్టీకి చెందిన టువంటి వ్యక్తికి మరియు టి.వి యాంకర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి పోలీస్ శాఖ వారికి వారి పై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా తాండూరులో కూడా వారిపై కంప్లయింట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మన భారతదేశం గంగా జమున తేజిమ్ కి నిదర్శనం గా ఉంది దాని,కొన్ని శక్తులు విడదీసే ప్రయత్నం లో ఇలాంటి మాటలు చెప్పి వారి వారి మనోభావాలను దెబ్బతీసే  కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి వారిపై కఠినంగా చర్య తీసుకోవాలి అలాగే మునుముందు ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.