మనోహరాబాద్ లో 264 ఉపాధి హామీ పనులకు తీర్మానం
తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 11:: మనోహరాబాద్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా 264 పనుల తీర్మానం చేసినట్లు రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మనోహరబాద్ గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ప్లానింగ్ గ్రామసభ. నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఉపాధి హామీ పథకంలో ఉన్న 264 పనుల గూర్చి చర్చించ గ్రామానికి అవసరమైన పనులు తీర్మానం చెయ్యడం గ్రామ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అందరం భాగస్వామ్యం అవుతామని సమావేశం లో ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరిరెడ్డి , మాజీ ఉమ్మడి మండలాల పాక్స్ వైస్ చైర్మన్ మాజీ ఉప సర్పంచ్ చిట్కుల వెంకట్ రెడ్డి తెరాస జిల్లా వార్డ్ సభ్యులు నవితదశరథ్ సంతోష్ హుమెరలయిక్ నిర్మల కుమార్ గౌడ్ ఉదయ్ శ్రీ శోభన్ రాజ్ గౌడ్ యాదగిరి గోశికలక్ష్మి బాలేష్ పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ తాడేపు రేణుకమహేందర్ ఈసీ లక్ష్మీనారాయన తెరాస నాయకులు అజయ్ గౌడ్ నరిగేనర్సింలు నితిన్ రెడ్డి సన్నీరెడ్డి సందీప్ రెడ్డి ఐకేపీ మహేలలు అంగన్వాడీ మహీలలు ఉపాధి హామీ కార్మికులు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.