మన అభివృద్ధి దేశానికి ఆదర్శం
` దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం దళిత బంధు
` కనీస అవసరాలకు సరిపోయేలా ఆసరా
` విప్లవాత్మక పథకం దళిత బంధు..
` బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం
` రాష్ట్రంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
` రోజురోజుకూ ఐటి రంగంలో అభివృద్ధి
` తెలంగాణ ఆచరిస్తోంది` దేశం అనుసరిస్తోంది’..
` ఈ మాట అక్షర సత్యం: ముఖ్యమంత్రి కేసీఆర్
` జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన సీఎం
హైదరాబాద్(జనంసాక్షి): నిరుపేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నామన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడిరచారు. లబ్ధిదారులను పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నామని, మహిళల పేరిట ఇండ్లను అందిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎందుకంటే ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదని స్పష్టం చేశారు.సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం ‘గృహలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో రూ.3 లక్షలు ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తొలిదఫాలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుతుందని వెల్లడిరచారు.
కనీస అవసరాలకు సరిపోయేలా ఆసరా
ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయమని సీఎ అన్నారు. అందుకే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాశిలోనూ, వాసిలోనూ పెన్షన్లు పెంచిందని చెప్పారు. గతంలో కేవలం రూ.200గా ఉన్న పింఛన్ మొత్తాన్ని రూ.2,016కు పెంచుకున్నామని తెలిపారు. దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే రూ.3016 నుంచి రూ.4016కు పెంచుకున్నామని చెప్పారు. 2014 నాటికి పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 44 లక్షకు పెరిగిందని వెల్లడిరచారు. వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులతోపాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించిందన్నారు. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించామని గుర్తుచేశారు.ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని వర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉందని, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాలలో కొంతమేరకు మేలు జరిగినా, ఆ తర్వాత ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకు సాగలేదని వెల్లడిరచారు. దాంతో దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయని చెప్పారు.
విప్లవాత్మక పథకం దళిత బంధు..
దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం ‘తెలంగాణ దళిత బంధు’ అని వెల్లడిరచారు. దళిత కుటుంబం తమకు వచ్చిన, నచ్చిన వృత్తి కానీ, వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ఇది ఒక నూతన చరిత్ర అని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెదికినా కనపడదన్నారు. దళితులు వ్యాపార రంగంలోకూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకొనే లాభదాయక వ్యాపారాల్లో వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెల్యూల్డ్ తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని అమలు పరుచుకుంటున్నామని వెల్లడిరచారు. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటున్నామని చెప్పారు.
బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం
బలహీన వర్గాలలోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, గ్రావిూణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని వెల్లడిరచారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపల పెంపకం, నేత కార్మికులకు సబ్సిడీపై నూలు, రంగుల సరఫరా, వారికి పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమా, మద్యం దుకాణాలలో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్, ఈత, తాటి చెట్లపై పన్నురద్దు, రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు కూడా విద్యుత్ రాయితీ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం అడవి బిడ్డలకు తీపి కబురు అందించిందని వెల్లడిరచారు. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, పోడు భూములకు పట్టాలందించిందన్నారు. గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్ జంగల్ జవిూన్ నినాదమిచ్చిన కుమ్రం భీమ్ పేరుతో ఏర్పాటైన అసిఫాబాద్ జిల్లా నుంచే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టిందన్నారు. ఆదివాసీ, గిరిజనులకు ఇచ్చిన పోడు భూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నదని చెప్పారు. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
తెలంగాణలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఐటీ రంగం గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రోజుకో కొత్త సంస్థ ముందుకు వస్తున్నదన్నారు. ఇవాళ ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా, నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715కు పెరిగిందన్నారు. అదేవిధంగా 2014లో ఐటీ ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, నేడది 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగిందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని, ఐటీ టవర్లు నిర్మించుకున్నామని వెల్లడిరచారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయని, చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయని సీఎం చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి చేతులు విూదుగా మన స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు, అవసరాన్ని బట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రతిజిల్లా ప్రధాన కేంద్రంలో జిల్లా సవిూకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నామని, దాంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైందని చెప్పారు. హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా అని సీఎం అభివర్ణించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశామని, గతంలోలా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్తు వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నామని చెప్పారు. నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నామని, అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా 69 వేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో హైదరాబాద్ లో మొత్తం 415 కిలోవిూటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నదని, విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నదని అన్నారు. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు, మిషన్ కాకతీయ,పెండిరగ్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని సీఎం చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు బీమా, 37 వేల కోట్ల రూపాయల వరకు పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయన్నారు. వ్యవసాయం పండుగగా మారిందని, సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారని, ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని అన్నారు. నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. తలసరి ఆదాయంలో కూడా 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని చెప్పారు. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ మాత్రమేని తెలిపారు. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నదని, తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మనకు బలమని, ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని, తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దామని సీఎం పిలుపునిచ్చారు.