రంగారెడ్డి,డిసెంబర్20(జనంసాక్షి): కాకతీయుల స్పూర్తిగా మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నామని నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు తెలిపారు. చెరువుల పునరుద్దరణ ఉద్యమంలా సాగుతుందని అన్నారు. రంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో మిషన్ కాకతీయపై సవిూక్ష సమావేశం జరిగింది. . ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… మిషన్ కాకతీయలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. కలిసికట్టుగా పని చేస్తేనే రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మిషన్ కాకతీయపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో సవిూక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఎస్ఈలు లేరన్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల అలుగులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. చెరువు నిండా నీరుంటే అనేక గ్రామాల ప్రజలు బతుకుతారన్నారు. జిల్లాలోని భూములను కబ్జాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో 4 జిల్లాలకు కలిపి ఒక ఎస్ఈ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో ఎస్ఈని నియమించామని పేర్కొన్నారు. టెండర్లు పిలిచే అధికారాలను వికేంద్రీకరణ చేసినం. టెండర్లంతా 15 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. అధికారులకే పూర్తి అధికారం ఇచ్చింనం. ఈ-ప్రాక్యూర్మెంట్ విధానంలోనే పనులు జరుగుతాయని చెప్పారు. ప్లాస్-5 కాంట్రాక్టర్లు రూ. 5 లక్షల వరకు టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. పనులు వేగవంతంగా, నాణ్యతగా జరగాలని పేర్కొన్నారు. పనుల విషయంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ చెరువుల లిస్ట్ తయారు చేయాలని కోరారు. కట్ట, తూము, అలుగులను బాగు చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు కింద వేల ఎకరాలు సాగు అవుతది. చెరువులు నిండితే బావులు, బోరుల్లో బాగా నీళ్లు వస్తాయని, మత్స్యకారులకు ఉపాధి దొరుకుతదని తెలియచెప్పారు. చెరువుకు కులం లేదు. చెరువు ఊరందరిదని పేర్కొన్నారు. పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తం. రేపటి బంగారు తెలంగాణకు సమగ్ర కుటుంబ సర్వే ఓ పునాది. అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తాం. ఆహార భద్రత కార్డు కేవలం నిత్యావసరాల సరుకులకే వర్తిస్తది. కుటుంబంలో ఒక్కోక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తం. ఆరోగ్య శ్రీ కార్డులు, ఇతర కార్డులతో సంబంధం లేదు. ఆహార భద్రత కార్డుల జారీ పక్రియ నిరంతరాయంగా కొనసాగుతదని ఆయన పేర్కొన్నారు.
మన చెరువుల పునరుద్ధరణ మహా ఉద్యమం





