Tuesday, 3 November 2026

మయన్మార్‌, కెంటకీలో స్వల్ప భూకంపం

మయన్మార్‌ : ఉత్తర మయన్మార్‌, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్‌లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం లేకపోయినప్పటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత 10కిలో మీటర్ల వరకూ వ్యాపించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. అమెరికాలోని కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్పభూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *