హైదరాబాద్,మే23( జనం సాక్షి): విప్లవాత్మక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు ఆరోగ్యం మరింతగా విషమించిందని సమాచారం. నాలుగు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురై, హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో కారణంగా హైదరాబాద్‌లోని స్టార్ హస్పిటల్‌లో చేరి, గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సహాయంతో శ్వాసను తీసుకుంటున్నారని రంగారావు కుమారుడు మాదాల రవి వెల్లడించారు. మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నారని, లైఫ్ సేవింగ్ మెషీన్ సాయంతో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. కిడ్నీలు చెడిపోవడం, శ్వాస సరిగా తీసుకోలేకున్నారని, శరీరంలోని పలు అవయవాల పనితీరు మందగించిందని, వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా, అభిమానుల ప్రార్థనలతో తన తండ్రి కోలుకుంటారనే భావిస్తున్నానని రవి అన్నారు.
———
మరింతగా క్షీణించిన మాదాల ఆరోగ్యం




