– ‘ఐటీ గ్రిడ్స్’లో సోదాలు నిర్వహించిన పోలీసులు
– అశోక్‌కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు
హైదరాబాద్, మార్చి5(జనంసాక్షి) : ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తుండటంతో ఇరు రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులను తలపిస్తున్నాయి. కేసీఆర్ ఏపీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తమ పార్టీ డేటాను వైకాపాకు అప్పగించాడంటూ టీడీపీ వాదిస్తుండగా.. ఏపీ డేటాను ఐటీ గ్రిడ్స్ చోరీ చేసిందని వచ్చిన ఫిర్యాదుల మేరకు తాము సోదాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ పేర్కొంటుంది.. ఇప్పటికే ఓ దఫా దాడులు నిర్వహించి పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న తెలంగాణ పోలీసులు.. మరోమారు మంగళారం ఐటీగ్రిడ్స్ కార్యాలయంలో సోదాలకు పూనుకున్నారు. పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్స్ కంపెనీ చేతికి రావడం వెనుకున్న వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. బ్లూఫ్రాగ్ సంస్థతో ఐటీ గ్రిడ్స్ ఉన్న సంబంధం ఏమిటనే దానిపై కూడా దృష్టి సారించారు. బ్లూఫ్రాగ్ సంస్థకు తాళాలు ఎందుకు పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. డేటా లీకేజీపై ఆయా అథారిటీలకు కూడా పోలీసులు లేఖలు రాయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆంద్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కుంభకోణంలో
ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల అశోక్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసుల కనుకసన్నల్లో అశోక్ ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎలాంటి సమాచారం లేదు – ఏపీ డీజీపీ
ఐటి గ్రిడ్ డేటా చోరీ స్కామ్‌పై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను కలవలేదని చెప్పారు.
మరోసారి సోదాలు




