అల్పపీడన ద్రోణి ప్రభావంతో జోరువానలు
హైదరాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదివారం వివిధ ప్రాంతాల్లో మరోమారు భారీ వర్షం నమోదయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి వరదనీరు చేరింది. వర్షం కారణంగా పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.అత్యధికంగా భూదాన్ పోచంపల్లిలో 8.4సెం.విూ. వర్షపాతం నమోదైంది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మో స్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు మధ్య కొమోరిన్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో సముద్రమట్టానికి 2.1 కి.విూ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని చెప్పారు. ఆవర్తనం ప్ర భావం తెలంగాణపై ఉండదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చరుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వానలు పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఐదు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం జోరువాన కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మబ్బులు కమ్ముకుని ఉన్నా సాయంత్రం నుంచి గ్రేటర్‌లోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, తిరుమలగిరి, నేరెడ్‌మెడ్, కాప్రా, అవిూర్‌పేట తదితర ప్రాంతాల్లో వాన పడింది. నల్లగొండ, జనగామ, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో జోరువాన కురిసింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో 6.5 సెం.విూ., మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో 5.5 సెం.విూ., రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 5.2 సెం.విూ. వర్షపాతం నమోదైంది. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో భారీవర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. తుర్కపల్లి, మోటకొండూర్, యాదగిరిగుట్ట, రాజాపేట, గుండాల, ఆలేరు, ఆత్మకూరు(ఎం) మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపూర్ మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. యాదగిరిగుట్ట మండలం సైదాపురం చెరువులోకి భారీగా నీరు చేరింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోనూ భారీ వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారితోపాటు కాలనీలు జలమయమయ్యా యి. జనగామ పట్టణంలో ఓ మోస్తరు వాన కురిసింది. సూర్యాపేట రోడ్డుపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగాలఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి.
మానకొండూర్, ఇల్లందకుంటలో ఓ మోస్తరు వాన పడింది. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వానపడింది. లక్షెట్టిపేట, హాజీపూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, జైపూర్, భీమారం, కోటపల్లిలో ఓ మోస్తరుగా.. జన్నారం, దండేపల్లి, తాం డూరు, బెల్లంపల్లి, చెన్నూర్ మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.
మరో రెండురోజుల పాటు వర్షాలు




