వర్ధన్నపేట నుంచి పగిటిపాటి దేవయ్య
అంబర్‌పేటకు ఓయూ విద్యార్థి నాయకుడు నిజన రమేశ్
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ జన సమితి ప్రకటించింది. శనివారం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటింగా తాజాగా మరో రెండుస్థానాలకు రెండు అభ్యర్థులను వెల్లడించింది. వర్ధన్నపేట అభ్యర్థిగా పగిటిపాటి దేవయ్య, అంబర్‌పేట అభ్యర్థిగా ఓయూ విద్యార్థి నాయకుడు నిజన రమేశ్ పోటీలో ఉండనున్నారు. ఈమేరకు వారికి పార్టీ అధినేత కొదండరామ్ బి-ఫారాలు అందజేశారు. తెలంగాణ జన సమితి మొత్తం 14 స్థానాల్లో నామినేషన్ వేయనుంది. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా తెజసకు 8 స్థానాలను కాంగ్రెస్ సర్దుబాటు చేయగా.. వీటికి అదనంగా మరో ఆరు స్థానాల్లోనూ అభ్యర్థులను తెజస బరిలోకి దించింది. తెజస తరఫున పోటీకి దిగనున్న ఏడుగురు అభ్యర్థులకు పార్టీ అధినేత కోదండరాం, పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాలశర్మ, తెజస నేతలు అంబటి శ్రీనివాస్, బైరి రమేశ్, ధర్మార్జున్‌ల సమక్షంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో బీఫారాలు అందజేశారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, మల్కాజిగిరి, వరంగల్ తూర్పు, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మహబూబ్‌నగర్ స్థానంలో తెదేపా తన అభ్యర్థిని ప్రకటించింది. వర్ధన్నపేట, అంబర్‌పేట నియోజకవర్గాల అభ్యర్థులపై ఆదివారం అర్ధరాత్రి వరకూ పార్టీ రాష్ట్ర కమిటీ కసరత్తు చేసింది. సోమవారం ఉదయం ఈ రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్.. తెలంగాణ జనసమితికి 9 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసి.. బీఫారంలు అందజేసింది. కాగా సోమవారంతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో వీరు నామినేషన్లు వేయడానికి వెళ్లారు.
తెలంగాణ జనసమితి బీఫారంలు అందుకున్న అభ్యర్థులు
మెదక్ : జనార్దన్ రెడ్డి, 2) సిద్దిపెట్ : భవానిరెడ్డి, 3) దుబ్బాక : రాజుకూమార్, 4) మల్కాజిగిరి : దిలిప్ కూమార్, 5) వరంగళ్ తూర్పు : ఇన్నయ్య, 6) మిర్యాల్ గూడ : విద్యాధర్ రెడ్డి, 7) మహబుబ్ నగర్ : రాజేందర్ రెడ్డి, 8) వర్థన్నపేట : పగిటిపాటి దేవయ్య, 9) అంబర్ పేట : నిజ్జన రమేష్




