మరో 24గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

చెన్నై: నీలం ప్రభావంతో తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుపాను కారణంగా చెన్నై తీరంలో గల్లంతయిన  కావేరి నౌకా సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. తప్పిపోయిన అయిదుగురి కోసం దక్షణ చెన్నై నుంచి ఉత్తర చెన్నై వరకు రెండు హెలికాఫ్టర్ల ద్వారా గాలిస్తున్నట్లు నౌకాదళ అధికారులు తెలియజేశారు.