మేడ్చల్,నవంబర్ 26(జనంసాక్షి): మల్కాజిగిరిలో ప్రజాకూటమిలోకి రావడానికి ఎడమోహం పెడమోహంగా ఉన్నా టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులను అక్కునచేర్చుకునే పనిలో టిజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పడ్డారు. మల్కాజిగిరి నియోజవర్గ మాజి శాశన సభ్యుడు ఆకుల రాజేందర్‌ను ప్రజాకూటమిలో ఆహ్వానించడానికి మిడియా సమావేశం నిర్వహించారు టిజేఎస్ నాయకులు. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని ఆకుల రాజేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం, మల్కాజిగిరి టిడిపి సీనియర్ నాయకులు మండల రాథా కృష్ణయాదవ్ లు పాల్గొన్నారు. అనంతరం ప్రజాకూటమి కండువాలు కప్పి ఆకుల రాజేందర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రజలకు తెరాస ప్రభుత్వం చేసింది ఏమి లేదని, ప్రజలకు హావిూలపేరున మోసాలు చేశారని, ప్రజాకూటమికి టిడిపి, కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉందని, ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి అభ్యర్థి దిలీప్ కుమార్ ను అందరూ కలిసికట్టుగా అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపించుకోవాలని అన్నారు. అలాగే మల్కాజిగిరిలోని ప్రజలు అనేక రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్నికల్లో గెలిచి స్థానికంగా ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి తీరుస్తామని తెలిపారు.




