మల్లన్న సేవలో మంత్రి హరీష్ రావు
శ్రీశైలం,జూలై2(జనం సాక్షి): శ్రీశైలం భ్రమరాంభా మల్లికార్జున స్వామివారిని మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయం చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు, సిబ్బంది శాస్తోక్త్రంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మల్లన్న బ్లాక్‌ను మంత్రి ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్రాబాద్ మండలం మాదవానిపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు అమ్రాబాద్ మండల కేంద్రంలోని గోదాం, మార్కెట్ యార్డును ప్రారంభించారు.