Monday, 2 November 2026

మళ్లీ భారీ వర్షాలు

888 హైదరాబాద్   :  వారం రోజులకు పైగా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన అల్పపీడనం కాస్తంత తగ్గుముఖం పట్టింది. అయితే మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశాలున్నాయి. 72 గంటల పాటు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశాలున్నాయి. వాతావరణ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఈ అల్పపీడన ప్రభావం ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి. అయితే మళ్ళీ ప్రారంభమయ్యే తుపాను కారణంగా ఉత్తర తెలంగాణాలో అత్యధిక వర్షాలు కురుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *