Tuesday, 3 November 2026

మవోయిస్టుల బంద్‌ పిలుపుతో పోలీసుల అప్రమతం

చర్ల,జనంసాక్షి:సుకుమా జిల్లాలోని పువ్వర్తలో ఈ నెల 16న జనవరి ఎన్‌కౌంటర్‌ నిరసిస్తూ ఈ నెల 26,27తేదీలలో ఉత్తర తెలంగాణ  బందుకు మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ్పషల్‌ జోనల్‌ కమిటి పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్ధుకు సమిపంలో భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం,వాజేడు,పేరూరు,చింతూరు,కూనవరం పోలీస్‌ స్టేషన్లను ఉన్న అధికారులు అప్రమత్తం  చేశారు. అనుమానితుల కదలికలపై,సరిహద్ధు ప్రాతం నుంచి డివిజన్‌లోకి వచ్చే అన్ని ప్రదాన రహదారులలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.తొవ్మిదిమంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగవచ్చున్న నిఘా వర్గాలహెచ్చరికలతో పోలీసులు, ప్రత్యేక బలగాలు అప్రమత్తమయ్యారు. డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్లకు,సరిహద్దు ప్రాతంలోని దండకారణ్యానికి భారీగా అదనపు బలగాలు చేరుకున్నాయి. దండకారణ్యాంలో గ్రేహౌండ్స్‌, సీఆర్‌పీఎఫ్‌,స్పెషల్‌ పార్టీ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *