వైరా జనంసాక్షి:సహకార సంఘాల ద్వారా గత వ్యవసాయ సీజన్‌లో జిల్లాలో లక్షా42వేల మంది రైతులకు రూ.400 కోట్ల పంట రుణాలు అందచేశామని జిల్లా కేంద్రా సహకార బ్యాంకు సీఈఓ రమణమూర్తి తెలిపారు. వైరాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా రైతులకు గత వ్యవసాయ సీజన్ ఖరీఫ్,రబీలో రూ.400 కోట్ల రుణాలు ఇవ్వగా ఇప్పటికే రు.383 కోట్ల రైతులు తిరిగి చెల్లించారని తెలిపారు. ఏడాదిలోగా రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మినహయింపును వర్తింపజేశామని చెప్పారు. ఈ ఖరీఫ్‌లోనూ ఎక్కువ మొత్తంలో పంట రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రూ.10కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బ్యాంకులు,సహకార సంఘాల ద్వారా రుణాలను పొందిన వారు సకాలంలో తిరిగి చెల్లించారు. సమవెశంలో బ్యాంకు మేనేజర్ గడ్డం కరుణాకర్‌రెడ్డి, సూపర్‌వైజర్ పసుముర్తి నారాయణరావు,వైరా,తల్లాడ,గరికపాడు,పూసలపాడు సొసైటీల సీఈఓలు చేబ్రోలు తిరుపతిరావు,వజ్రాలవీరారెడ్డి,దేనువకొండ నాగరాజు,తుళ్లూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.




