మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
– గుట్టురట్టు చేసిన పోలీసులు
విజయవాడ, జులై27(జనంసాక్షి) : విజయవాడలో క్రాస్ మసాజ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ, మొగల్రాజపురం, లబ్బీపేటల్లో ఉన్న మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లపై శుక్రవారం దాడులు చేశారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలారోజులుగా నిబంధనలకు విరుద్ధంగా.. మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు తేలింది. కొన్నిచోట్ల వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ దాడుల్లో నిర్వాహాకులతో పాటూ మసాజ్‌లు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇద్దరు మహిళా నిర్వహాకులను, 11మందికిపైగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో చాలా రోజులుగా బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ల ముసుగులో ఈ చీకటి బాగోతం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు టీమ్‌లుగా విడిపోయి ఈ దాడులు చేశారు. ఇకపై క్రాస్ మసాజ్‌లు చేయిస్తే కఠినచర్యలు తప్పవంటున్నామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచుతామంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. కాగా డైమండ్ బ్యూటీపార్లర్, లా రాయల్స్
పార్లర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.