Thursday, 5 November 2026

మహాకూటమికి చంద్రబాబే ఫైనాన్షియర్‌

– వెయ్యి కోట్లకు డీల్‌ కుదిరింది

– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి, నవంబర్‌14(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి(మహా కూటమి) అభ్యర్థులందరికీ చంద్రబాబు ఫైనాన్షియర్‌గా మారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ చంద్రబాబుతో భేటీ కావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌-టీడీపీల మధ్య రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డీల్‌ కుదిరిందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్‌ అని, కాంగ్రెస్‌ నేత గెహ్లాట్‌ రాహుల్‌ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే అన్నారు. మొత్తం విూద రూ.1000 కోట్లు పెట్టడానికి డీల్‌ కుదిరిందని, ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభమే కదా!’ అని పోస్ట్‌ చేశారు. కాగా, సాయిరెడ్డి విమర్శలపై టీడీపీ నేతలు ఇంకా స్పందించలేదు.