Thursday, 5 November 2026

మహాకూటమిని తరిమి కొట్టాలి

వారికి సీట్లు కూడా పంచుకోవడం రాలేదు

తొలిసారిగా సిఎం నుంచి బి. ఫామ్‌ అందుకోవడం ఆనందం

ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌

పాలమూరులో మహిళల పాదయాత్ర

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఓవైపు ప్రచారం, మరోవైపు నామినేషన్ల కోసం అవసరమైన ఏర్పాట్లలో ఉన్నారు. మహాకూటమిపై విమర్శలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కూటమి నేతలకు భంగపాటు తప్పదని అన్నారు. ఇదిలావుంటే తొలిసారిగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి భీ ఫాం తీసుకొని కారు గుర్తుపై పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. దేశంలో అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులు కేసిఆర్‌ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ప్రశంసించిన నాయకుడి నాయకత్వంలో భీ ఫాం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గంలో రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ వెంగళరావునగర్‌, గయాధీన్‌ బాగ్‌, నల్లాగుట్టు, కరీం కంపౌండ్‌ బస్తీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాకుటమి ఇప్పటి వరకూ సీట్ల పంపకాలే కాలేదని, మహాకూటమి కేసీఆర్‌ కుటుంబాన్నే విమర్శించాడానికి తప్ప దేనికీ పనికి రాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇతర పార్టీలను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపినిచ్చారు. ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని తెలియజేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఇలాంటి సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని అధికారులను పంపి తెలుసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 8000 రైతుబంధు పథకాలు పెట్టి రైతుల మనసు గెలుచుకున్నారని తెలిపారు. కూటమిని ప్రజలు విశ్వసించే స్థాయిలో లేరని మంత్రి తలసాని అన్నారు. ఇకపోతే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచారం నిర్వహించారు. గండిపేట్‌ మండలంలోని హిమాయత్‌ సాగర్‌ కాజాకిస్థాన్‌ దర్గా ప్రాంతంలో ప్రజా ఆశీర్వద సభ ఏర్పాటు చేశారు. సభకు సుమారు 2 వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో దర్గా ప్రాంతానికి చెందిన 200 మంది ముస్లిం సోదరులు, మహిళలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ గౌడ్‌ మాట్లాడారు. వృద్ధులు.., వికలాంగులకు పింఛను, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లాంటి పథకాలతో ప్రజలు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 60 ఏండ్లుగా మన అందరిని ఎంతో పీడించిన కూటమిని తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని మహిళలు పాదయాత్ర చేపట్టారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో తెలంగాణ జాగృతి మహిళల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయం కురుమూర్తి స్వామి ఆలయం వరకు మహిళలు పాదయాత్ర చేపట్టారు. అనంతరం దేవరకద్ర నియోజకవర్గం నుండి ఆల వెంకటేశ్వర రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని.. సుమారు 15 కిలోవిూటర్ల పాదయాత్ర చేపట్టారు. జ్యోషి, గాయత్రి, గోపాలకృష్ణ,కోన్నూరు ఎంపీటీసీ జయంతి ఆధ్వర్యంలో మదనాపురం నుండి కురుమూర్తి వరకు పాదయాత్రగా బయలుదేరి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో

వీరితో పాటు మరో 20 మంది మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు.