బోయినపల్లిలో సుహాసిని ప్రచారం
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): కూకట్ పల్లి నియోజకవర్గ మహా కూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఓల్డ్ బోయిన్పల్లి పర్యటించారు. ప్రచారంలో ఆమెకు హారతితో ప్రజలు స్వాగతం పలికారు . రాజకీయాల్లో మహిళల శక్తి పెంచాలని సుహాసిని కార్యకర్తలకు పిలుపునిచ్చారు . ఓల్డ్ బోయిన్పల్లి ఆర్ ఆర్ నగర్ లో నూతన పార్టీ ఆఫీస్ తెరిచారు ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే స్పందన బాగా ఉంది అని సుహాసిని తెలిపారు. ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేయడం సంతోషం ఉందని చెప్పింది. ఈసారి మహా కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు.




