బీరు టిన్స్‌పై గాంధీ చిత్రపటం
హైదరాబాద్ జనవరి04(జనంసాక్షి): భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో బీర్ టిన్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఆ టిన్‌పై మహాత్ముడి చిత్రాన్ని కూడా ముద్రించారు. అమెరికా కనెక్టికట్‌లోని న్యూ
ఇంగ్లాండ్ బ్రెవింగ్ కంపెనీ ఈ బీర్ టిన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారత్‌తో పాటు అమెరికాలోని భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు
చెప్పింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించాలని కోరింది.
చౌకబారు పబ్లిసిటీ కోసమే ఆ కంపెనీ ‘గాంధీ-బాట్’ పేరుతో బీర్ టిన్నులను విడుదల చేసిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా మద్యం కంపెనీపై చర్య తీసుకోవాలంటూ హైదరాబాద్ కోర్టులో ఓ న్యాయవాది ఓ పిటీషన్ కూడా దాఖలు చేశారు.





