Monday, 2 November 2026

యుద్ధ ప్రాతిపదికన వాటర్‌ గ్రిడ్‌

5

విద్యుత్‌ పైపు లైన్ల నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌
సిఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్‌  జనవరి4(జనంసాక్షి) : తెలంగాణ మంచినీటి సరఫరాకు సంబంధించి ఉద్దేశించిన వాటర్‌ గ్రిడ్‌ సవిూక్ష సమావేశం ఆదివారం ఇక్కడి ¬టల్‌ కాకతీయలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు వాటర్‌ గ్రిడ్‌. ఈ ప్రాజెక్టు బాధ్యత ఆర్‌.డబ్ల్యుఎస్‌ శాఖదే అయినప్పటికీ అనేక ప్రభుత్వ శాఖలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ఈ గ్రిడ్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతిరోజూ ఏయే శాఖలు ఏయే పనులు చేయాలో ఎవరు ఏ భాధ్యతలు తీసుకోవాలో ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. మంత్రులు, అధికారులు తమ బాధ్యతలను చేయాల్సిన పనులను గుర్తించారు. ఇప్పటి నుంచే కార్యరంగంలో దూకడానికి సన్నధ్ధమవుతున్నారు. అటవీ, రోడ్లు భవనాలు శాఖల నుంచి ఇతర శాఖల నుంచి అనుమతుల మంజూరులో ఎలాంటి క్లిష్టత లేకుండా జాప్యం జరగకుండా సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి సూచించారు. గ్రిడ్‌ కోసం 29 ఇన్‌టేక్‌ బావులు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫిబ్రవరిలో ఈ బావుల నిర్మాణం పనులు ప్రారంభించాలని, వీటి నిర్వహణకు కావలసిన విద్యుత్‌ సరఫరా కూడా వెంటనే జరిగేలా చూడాలని పేర్కొన్నారు. పైపు లైన్ల నిర్మాణానికి, విద్యుత్‌ స్థంభాలు ఏర్పాటు చేయడానికి అటవీ ప్రాంతంలో ఆటంకాలు ఎదురుకాకుండా అటవీ శాఖ అధికారులు వెంటనే అనుమతి మంజూరు చేయాలని సూచించారు. అలాగే రహదారుల వెంట పైప్‌లైన్‌ నిర్మించేటప్పుడు కూడా ఆర్‌డబ్ల్యుఎస్‌ , పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్లకున్న రైట్‌ఆఫ్‌వే విడ్జ్‌లో పైపులైన్‌ వేయాలని ప్రైవేట్‌ భూముల్లో పైప్‌లైన్‌ వేయడానికి రైట్‌ ఆఫ్‌ వే కోసం చట్టం తేవాలన్నారు.

ఇన్‌టేక్‌ వెల్స్‌ వద్ద సబ్‌స్టేషన్ల నిర్మాణానికి, పంపింగ్‌, లిఫ్టింగ్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అవసరమయ్యే విద్యుత్‌ అందించడానికి విద్యుత్‌ శాఖ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. విద్యుత్‌పోళ్ల నిర్మాణానికి రైట్‌ ఆఫ్‌ వే ఇవ్వాళనీ ప్రభుత్వం నిర్ణయించిది.దీనికి కోసం బ్లాకెట్‌ పర్మిషన్‌ ఇస్తాం.

ఇన్‌టేక్‌ వెల్స్‌ నిర్మాణానికి, సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రాజెక్టుల వద్ద స్థలం అప్పగించడానికి నీటి పారుదల శాఖ సంస్థిదత వ్యక్తం చేసింది. దీనికి కోసం కూడా ఒకే ఉత్తరవుతో అనుమతులు వస్తాయి. సబ్‌స్టేషన్లకు డెడికేటెడ్‌ విద్యుత్‌ లైన్లు వేయాలి.

రాష్ట్రంలో మొత్తం 56వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాట్స్‌ (డబ్య్లూటిపీ) నిర్మించాలని నిర్ణయం జరిగింది.

ప్రభుత్వ భూముల్లో పైప్‌ లైన్‌ వేయడానికి, విద్యుత్‌ లైను వేయడానికి బ్లాకెట్‌ పర్మిషన్‌

వరంగల్‌ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నల్గోండ జిల్లా భువనగిరి, ఆలేరు, మెదక్‌ జిల్లా,గజ్వేల్‌, దుబ్బాక, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ లాంటి నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచి నీరు అందివాలనీ నిర్ణయించారు. గ్రీడ్‌కు సంబంధించి అవగాహన కల్పించేందుకు, క్షేత్రస్థాయిలో వచ్చే ఇబ్బందులను తొలగించడానికి త్వరలోనే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలనీ నిర్ణయం.

?గగ్రీడ్‌కు సంబంధించి తలెత్తే అంశాలపై ఎప్పటికప్పుడు సవిూక్షించుకుని, నిర్ణయాలు తీసుకునేందుకు శాఖల కార్యదర్శులతో ఓ కవిూటి వేయాలని నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *