Tuesday, 3 November 2026

మహా కూటమిదే బీహార్‌..

C

– నీతీష్‌కే మొగ్గు

– ఎగ్జిట్‌పోల్‌ అంచనా

న్యూఢిల్లీ నవంబర్‌ 5 (జనంసాక్షి): హోరా హోరీ పోరులో బిహార్‌ వాసులు… మహాకూటమికే పట్టంగట్టే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చెబుతున్నాయి. అయితే, వివిధ వార్తాసంస్థలు ఇచ్చిన అంచనాలలో వేర్వేరుగా ఫలితాలు వస్తున్నాయి. టైమ్స్‌ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే – సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు.

బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మహాకూటమి తరఫున నితీష్‌ కుమార్‌, లాలుప్రసాద్‌ లాంటి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. తొలుత మహాకూటమిలో సమాజ్‌ వాదీ పార్టీ కూడా ఉన్నా.. తర్వాత మాత్రం ములాయం సింగ్‌ యాదవ్‌ మాత్రం దాన్నుంచి తప్పుకొన్నారు. ప్రచార పర్వం ¬రా¬రీగా జరిగింది. బిహార్‌ రాష్ట్రంలో ప్రధానంగా విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, పేదరికం లాంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటికి కారణం విూరంటే.. విూరంటూ ప్రధాన పక్షాలు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై వివిధ జాతీయ వార్తా చానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించాయి. వాటి ప్రకారం అంచనాలు ఇలా ఉన్నాయి..

బిహార్‌ ప్రజలకు కృతజ్ఞతలు : నితీశ్‌ కుమార్‌

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకిచ్చిన అపూర్వ మద్దతుకు కృతజ్ఞతలు అంటూ బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యమే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందబోతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు ఎన్నికల సంఘం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఐదు దశల్లో 242 బిహార్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఈ సాయంత్రంతో పూర్తయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. లౌకిక కూటమి, ఎన్డీయే కూటమిల మధ్య ¬రా¬రీ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో నితీశ్‌ పై విధంగాట్వీట్‌ చేశారు. బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు సంచలనం రేపుతాయన్నారు. మహాకూటమి మొత్తం 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. భాజపా కూటమి 40 స్థానాలకే పరిమితం అవుతుందన్నారు.

భాజపా ఆధిక్యం చూపిన ఎగ్జిట్‌పోల్స్‌ను ట్వీట్‌ చేసిన సుశీల్‌ మోదీ

బిహార్‌ భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ న్యూస్‌24-టుడేస్‌ చాణిక్య ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను ట్వీట్‌ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ దాదాపు భాజపా కూటమికి 155, జేడీయూ కూటమికి 83, ఇతరులకు 5 సీట్లు వస్తాయని పేర్కొంది.

మేము కేవలం అభివృద్ధిపైనే దృష్టిపెట్టాం: నఖ్వీ

మేము కేవలం అభివృద్ధి గురించే మాట్లాడామని, ఇతర పార్టీలు ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించేందుకు ప్రయత్నించారని భాజపా నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అనంతరం నఖ్వీ మాట్లాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *