
రాజ్‌నాథ్ ఇంటిముందు ‘ఆప్’ ధర్నా
న్యూఢిల్లీ, డిసెంబర్8 (జనంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ కొరవడిందని, క్యాబ్‌డ్రైవర్ మహిళపై అత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం ఆమ్ ఆద్మీపార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. రాజధానిలో అత్యాచార ఘటనలపై నిరసన తెలుపుతూ ప్లకార్డులు పట్టుకొని ఢిల్లీలోని అశోకా రోడ్డులో రాజనాథ్ ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. భద్రతా ఏర్పాట్లలో కేంద్రం వైఫల్యమవుతోందని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పార్లమెంటు సీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజధానిలో భద్రత విషయంపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నివాసం ఎదుట కూడా ఆందోళన చేస్తామని ఆప్ కార్యకర్తలు తెలిపారు. ఈ ఘటనపై పార్లమెంటులోనూ చర్చించాలని ఆప్ నేత అశుతోష్ అన్నారు. దీనిపై ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం లోక్ సభలో వివరణ ఇచ్చారు. అత్యాచార ఘటనలు సమాజానికి సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. జీరో అవర్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఈ సంఘటనపై ప్రకటన చేశారు. అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాధ్ సింగ్ స్పష్టం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.




