Tuesday, 3 November 2026

రామలింగరాజుకు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

సత్యం కుంభకోణంలో తుది తీర్పు
5
హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సత్యం కుంభకోణంపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణంలో మొత్తం ఏడు రకాల కేసులను నమోదు చేయగా, అందులో ఆరు కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించింది. ఒక కేసును కొట్టి వేసింది. రామలింగరాజు, రామరాజులకు 5 కేసుల్లో రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నాలుగు కేసుల్లో ఒక్కోదానికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. రామ్‌ మైనంపాటికి 3 కేసుల్లో ఆర్నెళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.10లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. అదేవిధంగా సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ జి పాలెపు, ఎన్‌.శ్రీనివాస్‌, వినోద్‌ కె దామ్‌, టి.ఆర్‌.ప్రసాద్‌లకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించగా, వడ్లమాని శ్రీనివాస్‌కు 3 కేసుల్లో 6 నెలల చొప్పున జైలుశిక్ష విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *