మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): గాంధీభవన్‌ ముందు మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్‌ చేసేందుకే కాంగ్రెస్‌?పై స్మృతిఇరానీ విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. రాష్ట్రపతి అంశంలో అధిర్‌ రంజన్‌ ఇప్పటికే క్షమాపణ చెప్పారని.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మహిళా కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు.