న్యూఢిల్లీ: ప్రధాన రైళ్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఇవాళ లోక్‌సభలో 2015-16గాను ఆయన రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంధులకు సౌకర్యవంతంగా బోగీల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగుల కోసం లోయర్ బెర్త్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.




