మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్ చార్జీల మీద ధర్నా- పోలీసులు అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలింపు

       జనగామ (జనం సాక్షి)జూన్25:  టీపీసీసీ మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు  పిలుపు మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య  ఆదేశాల మేరకుజనగామ జిల్లా కేంద్రంలో మహిళ కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిరా  ఆధ్వర్యంలో ఆర్.టి.సి.చార్జీలు పెరిగిన ధరల మీద జనగామ బస్ డిపో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు .అనంతరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్ పల్లి లింగజి   జనగామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ జనగామ జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్ జనగామ జిల్లా ఒబిసి సెల్ చైర్మన్ లోక్కుంట్ల ప్రవీణ్  జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి మాట్లాడుతూ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టి.ఆర్.స్ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని గతంలో టీఎస్ఆర్టీసీ రౌండప్ పేరుతో బస్సు చార్జీలను భారీగానే పెంచింది. ఇప్పుడు మరోసారి బస్సు చార్జీలు భారీ మొత్తంలో పెంచింది. దీంతో ప్రయాణికులపై ఎక్కువ భారం పడనుంది. ఇప్పటివరకు అన్నీ ధరలు పెరగ్గా, తాజాగా ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ చార్జీలు కూడా పెంచడంతో ఇటు వాహనం ఉపయోగించే వీలు లేక అటు బస్సు ఎక్కే పరిస్థితి లేక సామాన్యులు అల్లాడుతున్నారన్నారు తెలిపారు  అనంతరం పోలీసులు అరెస్టు చేసి జనగామ పోలీసు స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమంలో  వంగాల మల్లారెడ్డి జిల్లా నాయకులు బడికె కృష్ణస్వామి కట్ట కృష్ణ సలేంద్ర శ్రీనివాస్ పట్టురి శ్రీనివాస్ ,జక్కుల వేణుమాధవ్ జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతిష్ , రారాజేశ్వరి, జనగామ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ  వేణు వందన   బుర్ర బలమణి  గుండె పద్మ ,మైనార్టీ సెల్ అధ్యక్షుడు యాసిన్ వేముల మల్లేశ్ జయ మల్లేశ్ మహేశ్వరం శ్రీనివాస్ కొండ శ్రీనివాస్  సుల్తాన్ గోవింద రెడ్డి ఎదునూరి  కృష్ణ .భిక్షపతి పిట్టల రాజు   కందుల రాజు  .ఫయాజ్  సౌడ మహేష్ .అజం చింతకింది నరేష్ పులిగిల్లా శివ యాదవ్ కసాని విజయ్ పాముకుంట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.