Tuesday, 3 November 2026

మహిళ మెడలోనుండి గొలుసు చోరీ 

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): నగరంలో చైన్‌స్నాచర్ల దోపిడి రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా
కాప్రా మండలం సైనిక్‌ పురిలో ఇవాళ మధ్యాహ్నం గొలుసు దొంగతనం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మెడలోని 7 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొలుసు దొంగల కోసం గాలిస్తున్నారు.