Tuesday, 3 November 2026

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు 

నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తాం
సీపీ అంజనీకుమార్‌
హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి) : ఖైరతాబాద్‌ లోని విశ్వేశ్వరయ్య భవన్‌ లో హైదరాబాద్‌ పోలీసు అధికారుల సమావేశం జరిగింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులతో సీపీ అంజనీ కుమార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ ఏడాది లక్ష్యాలపై పోలీసులకు అంజనీ కుమార్‌ దిశానిర్దేశం చేశారు. సైబర్‌ నేరాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు సీపీ. ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తామన్నారు. ఎస్‌ నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక శిక్ష ఇస్తామని సీపీ తెలిపారు.