Tuesday, 3 November 2026

మాకివ్వండి అవకాశం

C
– 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తాం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి14(జనంసాక్షి): హైదరాబాద్‌ను ఇన్నేళ్లు అన్ని పార్టీల నేతలు ఏలారని, వారు చేసిన సక్కదనమేంటో మనకు కనిపిస్తోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. నగరాన్‌ఇన ఎంఐఎం, టిడిపి, బిజెపి,కాం/-గ్రెస్‌ నేతలంతా ఏలారని అన్నారు. నగరానికి కావాల్సింది అభివృద్ది అని అన్నారు. అది కేవలం టిటిఆర్‌ఎస్‌ వల్లనే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై హైదరాబాద్‌ వాసులకు పూర్తి నమ్మకముందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 18 నెలల తెరాస పాలనలో ఇతర ప్రాంతాల వారిపై ఈగ కూడా వాలకుండా శాంతిభద్రతలు పరిరక్షించినట్లు చెప్పారు. మతం పేరుతో భాజపా, ప్రాంతం పేరుతో తెదేపా రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌కు ఎన్డీయే ప్రభుత్వం ఏం చేసిందో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 65 ఏళ్లలో ప్రజలకు ఏవిూ చేయని కాంగ్రెస్‌కు ఎందుకు

ఓటెయ్యాలి? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ వర్గానికి మేలు చేసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పేదల పక్షాన నిలవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్‌ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు.  తెలంగాణభవన్‌లో బీజేపీ నేతలు బంగారు ప్రకాష్‌, సామ సుందర్‌రెడ్డి తదితరుఉల టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. మోదీ హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్‌ చేశారు. ఎన్నికలపుడు నల్ల ధనాన్ని భారత్‌కు రప్పిస్తామని మోదీ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. నల్లధనం తేవడం పక్కన బెడితే ఎప్పుడూ విదేశాల్లో తిరుగుతున్న ఆయనను మనం ఇక్కడకు తేవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. మోదీ చేసినవి రెండేరెండు ఉన్నాయని అన్నారు. ఒకటి చీపురుకట్ట ఇచ్చి ఎవరి ఇల్లు వాళ్లు ఊడ్చుకోమనడం, రెండోది ఎవరి బ్యాంక్‌ ఖాతా వారు తెరుచుకుని ఎవరి డబ్బును వారు ఖాతాలో జమ చేసుకోమనడమేనని ఎద్దేవా చేశారు. మోదీ ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా? అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టాలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా? అని నిలదీశారు. బీజేపీకి ఎందుకు హైదరాబాద్‌ ప్రజలు ఓటు వేయాలన్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన మోదీ తెలంగాణకు కూడా రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతలు మోదీని ఎందుకు పట్టుపట్టరని మండిపడ్డారు. హైదరాబాద్‌ ప్రజలు ఇవాళ ప్రశాంతంగా ఉన్నారని అలాంటి వాతావరణాన్ని కలుషితం చేద్దామని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రాంతం పేరుతో టీడీపీ, మతం పేరుతో బీజేపీ ఓట్లను దండుకోవాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ మత రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మనలో మనం కొట్టుకోవడంలేదని టీడీపీ బాధపడుతోందని, ఆ పార్టీ బాధ చెప్పనలవి కాదని తెలిపారు. హైదరాబాద్‌కు ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ లోకలే అని  కేటీఆర్‌ స్పష్టం చేశారు. చేయని పనులు చెప్పమని… చేసినవే ప్రజలకు చెబుతామని ఆయన తెలిపారు. అందరికీ ప్రస్తుతం డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఇవ్వలేమని… వచ్చే నాలుగేళ్లలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. అప్పటి దాకా ఓపిక పట్టాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా పేదలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినంతగా ఉత్సాహాపూరిత వాతావరణం ఇప్పుడే తెలంగాణ భవన్‌లో కనిపిస్తుందన్నారు. అయితే ఇతర పార్టీల కార్యాలయాల్లో సందడే లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ వాసులు టీఆర్‌ఎస్‌కు స్కి తప్ప ఇతర పార్టీలకు ఓటేసే పరిస్థితి లేదన్నారు.  గ్రేటర్‌లో  టీఆర్‌ఎస్‌కు  తప్ప ఏ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  రాజధానిపై గులాబీ జెండా ఎగరటం ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో వామపక్ష కూటమి ఇదిలావుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో లోక్‌సత్తా, వామపక్షాలు సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ‘వన్‌ హైదరాబాద్‌’ పేరిట 92 డివిజన్లలో పోటీ చేయాలని కూటమి ప్రకటించింది. లోక్‌సత్తా 35, సీపీఎం 33, సీపీఐ 22, ఎంసీపీఐ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *