మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యకి పితృయోగం

పరామర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 9 (జనంసాక్షి) ఆత్మకూరు మండల పరిధిలోని పారుపల్లి గ్రామంలో ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ తండ్రి బూడిద సోమయ్య అనారోగ్యంతో మరణించారు సోమయ్య పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు బిక్షమయ్యను పరామర్శించారు సోమయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్  ఆత్మకూరు ఎంపీటీసీ యాస కవితఇంద్రారెడ్డి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఉపాధ్యక్షురాలు నాయిని శశికళ రెడ్డి రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే భిక్షపతి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ వాసులు తదితరులు పాల్గొన్నారు