మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):
మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ ఇటీవల గుండెపోటు తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కె శోక సంద్రంలో మునిగిపోయిన దత్తాత్రేయ ను, కుటుంబ సభ్యులను కెప్టెన్ పరామర్శించి ఓదార్చారు. వైష్ణవ్ మృతి అత్యంత దురదృష్ట కరమని అన్నారు. వైష్ణవ్ మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ వెంట ఆయన మనుమడు, టీఆరెస్ యువనేత వొడితల ప్రణవ్ ఉన్నారు.