Wednesday, 4 November 2026

మానసిక రుగ్మతలతో ప్రజల్లో ఆందోళన

అనంతపురం,జూలై7(జ‌నం సాక్షి): అనంత జిల్లాలో వయసుతో భేదం లేకుండా మానసిక రుగ్మతలు వేధిస్తున్నాయని వైద్యప్రముఖులు అభిప్రాయపడ్డారు. ప్రతి వంద మందిలో 70 మందిని రుగ్మతలువేధిస్తున్నాయన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇవన్నీ చిన్నచిన్న సమస్యలే. వాటిపై తగిన అవగాహన కల్పించేం దుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా అనంతలో మానసిక కుంగుబాటుతో సతమతం అవుతున్నారు. విద్యార్థులతో మొదలుకుని వృద్ధుల దాకా సమస్యలు వెంటాడుతున్నాయి.