న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) క్రమంగా మార్కెట్‌పై పట్టు కోల్పోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మార్కెట్ వాటా 70 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి(మార్చి 2014) ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 75 శాతంగా నమోదైంది.
క్రమంగా తగ్గుతూ వస్తున్న తొలి ప్రీమియం వసూళ్లు ఇందుకు కారణమయ్యాయి. 2014-15లో గడిచిన మూడు త్రైమాసికాల్లో(ఏప్రిల్-డిసెంబర్) విక్రయించిన పథకాల ప్రీమియం వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 21 శాతం తగ్గి రూ.51,667.07 కోట్లకు పరిమితమయ్యాయి.
అదే డిసెంబర్ 2013తో ముగిసిన తొమ్మిది నెలలకాలానికి కంపెనీ తొలి ప్రీమియం వసూళ్లు రూ.65,774.47 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరానికంతటికీ(2013-14) తొలి ప్రీమియం వసూళ్ల కింద రూ.90,123.75 కోట్లు రాబట్టగలిగింది.