హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన సక్సెస్‌తో తెలుగు తమ్ముళ్ళు తెలంగాణలో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. తెలుగుదేశం క్యాడర్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహ పరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. దీంతో ఆయన రెండు రోజుల కరీంనగర్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 3వ తేదీన కరీంనగర్‌లో పర్యటిస్తారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మార్గమధ్యంలో గజ్వేల్, సిద్ధిపేటలో కార్యకర్తలతో మినీ సభలు నిర్వహిస్తారు. 23 నుంచి 25 వరకూ ఆయన కరీంనగర్‌లో ఉంటారు. చంద్రబాబు పాల్గొనే బహిరంగసభకు భారీగా కార్యర్తలను తరలించడంతో పాటు ముందుగా సన్నాహక సభలు జరపాలని టీ.టీడిపీ నిర్ణయించింది.




