మాలధారణ హిందుధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది.

గురుస్వామి భైంసా ఆలయ అర్చకుడు మంత్రి సాయినాథ్

భైంసా రూరల్ డిసెంబర్ 13 జనం సాక్షి

అయ్యప్ప,హనుమాన్ మాల ధారణ ఆచరణ ద్వారా హిందుధర్మాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుమని గురుస్వామి మంత్రి సాయినాథ్ అన్నారు.మంగళవారం గురుస్వామి ఆధ్వర్యంలో కుబిర్ మండలం సోనారి గ్రామం లో నరసింహ కన్య స్వామి నిర్వ హించిన పడిపూజా లో తాలూకా లోని పలువురు స్వాములు హాజరయ్యారు.ఈ సందర్బంగా బై0సా షణ్ముఖ అయ్యప్ప సన్నిదానo స్వాములు చందు స్వామి వినోద్ స్వామి యోగేష్ స్వామి సన్నిధానం స్వాములు పడిపూజా కి హాజరైన స్వాములకు హిందువుల పవిత్రగ్రంథమైన భగవత్గితను కానుక గా అందించారు. హిందూ సమాజా0 మరింత ముందుకు పోయేవిధంగా,మానవుడు మాధవుడు అయ్యే విధంగా భగవద్గీత పఠన0 ఎంతో ఉపయోగపడుతుందని, అలాంటి భగవద్గీత ప్రతిఒక్క స్వామికి అందాలనే ఉద్దేశంతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా గురు స్వామి మాట్లాడుతూ…మాల ఆచరణతో భక్తులు అధ్యాత్మిక వైపు అడుగులు వేసి,హిందు సమాజాన్ని మరింత బలన్ని చేకురుస్తున్నాయని,సనాతన హిందు సంప్రదాయలను గుర్తు చేస్తున్నాయన్నారు. పడి పూజలో పెంటాజి గురుస్వామి మరియు తాలూకా స్వాములు వచ్చారు