మాలీలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం

13 మంది ఫ్రెంచ్‌ సైనికుల మృతి
న్యూఢిల్లీ,నవంబర్‌26(జనం సాక్షి): ఆఫ్రికాలోని మాలీ దేశంలో హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటనలో 13 మంది ఫ్రెంచ్‌ సైనికులు మృతిచెందారు. జిహాదీల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుర్ఘటన పట్ల ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్‌ మాక్రన్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మాలీ దేశంలో 2012 నుంచి ఇస్లామిక్‌ మిలిటెంట్లు విధ్వంసం సృష్టిస్తున్నారు.