హైదరాబాద్, మార్చి 31 : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల కేసు విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. మా ఎన్నికల తీరు సమంజసంగా లేదంటూ ఒ.కళ్యాణ్ అనేవ్యక్తి సిటీ సివిల్‌కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిగింది. గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికలు జరిగిన తీరుపై వీడియో ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించాలి. అయితే మా తరపును ఇప్పటి వరకు వీడియో ఫుటేజ్ కోర్టుకు సమర్పించలేదు. కౌంటర్ పిటిషన్‌ను కూడా దాఖలు చేయలేదు. దీంతో ఏప్రిల్ 7లోగా పోలింగ్ వీడియో సీడిలు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కోర్టు తీర్పు వెలువడని నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి.
‘మా’ ఎన్నికల కేసు విచారణ వాయిదా




