మిర్చియార్డులో మెరుగైన చర్యలు

గుంటూరు,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): గుంటూరు మిర్చియార్డులో కమిషన్‌ దోపిడీని కఠినంగా అణచివేస్తామని ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు.  మిర్చియార్డులో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో కంటే ప్రస్తుతం యార్డులో కొంతమేర అక్రమాలకు అడ్డుకట్ట పడినప్పటికీ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదన్నారు. గతంలో ఏజెంట్ల కారణంగా  ప్రతి ఏడాది వందల కోట్లు రూపాయలు నష్టపోయాని వివరించారు. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. జీరో, కటింగ్‌, మచ్చుకాయల నియంత్రణలో బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. రైతుల కష్టార్జితం పక్కదోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యార్డుకు వచ్చే రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని  ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తెలిపారు.

తాజావార్తలు