Monday, 2 November 2026

మిర్చి బస్తాలు సీఎం ఇంటికి పంపి ఘాటెలా ఉంటుందో తెలుపుదాం: రేణుకా

హైదరాబాద్: రైతులెవరూ మిర్చి పంటను తగులబెట్టవద్దని, ఆ బస్తాలను ముఖ్యమంత్రి ఇంటికి పంపించి మిర్చి ఘాటెలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్లీనరీ, సభలకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని, అదే రైతులకు వంద కోట్లు ఇవ్వలేరా? అంటూ ఆమె ప్రశ్నించారు. మద్దతు ధర అడిగిన రైతులను గుండాలు అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జనావేదన సభలోనే మిర్చి సమస్యను ప్రస్తావించామని రేణుకా చౌదరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *